>

తెలుగు మాస్టారునీ నియమించుకున్న శ్రద్ధా కపూర్‌

తెలుగు మాస్టారునీ నియమించుకున్న శ్రద్ధా కపూర్‌

హైదరాబాద్: సుజిత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మేరకు ఆమె మంగళవారం నుంచి సాహో సెట్లో అడుగుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌లపై ఓ ఫ్యాక్టరీ నేపథ్యంలో సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

 శ్రద్ధా సెట్లో అడుగుపెట్టింది ఇప్పుడే అయినా.. వారం రోజుల నుంచీ హైదరాబాద్‌లోనే ఉంటోంది తను. ఈ సినిమాలోని స్క్రిప్టుని దగ్గర పెట్టుకొని సంభాషణలు ఎ విధంగా పలకాలో నేర్చుకొంటోందట. తెలుగులో శ్రద్దాకపూర్‌ నటిస్తున్న తొలి చిత్రం ఇది. కాబట్టి తెలుగు భాషపై పట్టు సంపాదించడానికి ప్రయత్నిస్తోందన్నమాట. దీనికోసం ప్రత్యేకంగా ఓ తెలుగు మాస్టారునీ నియమించుకొందట.

యాక్షన్‌ సన్నివేశాలకు ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. కేవలం యాక్షన్‌ సన్నివేశాల కోసమే రూ.20 కోట్లపైచిలుకు బడ్జెట్‌ కేటాయించినట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.