‘వీరే డి వెడ్డింగ్‌’ తొలి గీతం విడుదల

‘వీరే డి వెడ్డింగ్‌’ తొలి గీతం విడుదల

  సోనమ్‌ కపూర్‌, కరీనా కపూర్‌, స్వరభాస్కర్‌, షిఖా తలసాని తదితరులు నటించిన చిత్రం 'వీరే డి వెడ్డింగ్‌'. శశాంక ఘోస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్‌, రియో కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌ని బుధవారం విడుదల చేశారు. బాద్‌షా ఈ గీతాన్ని ఆలపించారు. సోనమ్‌, కరీనా, స్వర భాస్కర్‌ జెంట్స్‌ మోడల్స్‌తో డాన్స్‌లు వేస్తూ కనిపించారు. పాట కూడా చాలా హుషారుగా ఉంది. స్టీరియోటైపికల్‌ రోల్స్‌ వేస్తున్నట్టు ఈ పాట ద్వారా అర్ధమైంది. ఈ గీతం మొత్తం మహిళలదే పైచేయిగా సాగింది. మగవారు అలంకరణకే అన్నట్టుగా పరిమితం చేశారు. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ కొత్తగా ఉన్నట్టుందని గీతం వీక్షించిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.