వివాదంలో ‘96’ సినిమా

వివాదంలో ‘96’ సినిమా

 సౌత్ సీనియర్‌ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 96. కోలీవుడ్ సంచలన నటుడు విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సీ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వివాదంలో చిక్కుంది. ఈ సినిమా కథ తనదంటూ ఆర్‌ విచు అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు.తాను 96 చిత్ర నిర్మాత నంద గోపాల్‌కు నాలుగైదు సంవత్సరాల క్రితం ఈ కథ వినిపించానని.. ఇప్పుడు అదే కథను మరో దర్శకుడితో తెరకెక్కించారని తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై చిత్రయూనిట్ స్పందించలేదు. తమిళ నాట ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో దిల్‌రాజు బ్యానర్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ఈసినిమా నాని, సమంతలు జంటగా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.