వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి

వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి

  రత్తాలు రత్తాలు.... అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రాయ్‌లక్ష్మి చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. 'వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి' పేరుతో నటిస్తోన్న ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంతోనే కిషోర్‌ కుమార్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కార్తీక్‌, ప్రవీణ్‌, మధు నందన్‌ కీలక పాత్రధారులు. పూజిత పొన్నాడ ప్రత్యేక పాత్రలో నటించనుంది. హరి గౌర వేర్‌ సంగీతం అందిస్తున్నాడు. తాటవర్తి కిరణ్‌ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు అందిస్తున్నాడు. దసరా సీజన్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఎం శ్రీధర్‌ రెడ్డి, హెచ్‌ ఆనంద్‌ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబీటి క్రియేషన్స్‌ సంస్థపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజిత పొన్నాడ, కార్తీక్‌, ప్రవీణ్‌, మధు నందన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.