యంగ్ బ్యూటీకి ఫిదా అయిన సందీప్

యంగ్ బ్యూటీకి ఫిదా అయిన సందీప్

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న నక్షత్రం సినిమాతో బిజీగా ఉన్న ఈ హీరో ఓ తమిళ సినిమా కూడా చేయనున్నట్టు సమాచారం. ఇక త్వరలో మహేష్ బాబు సోదరి మంజుల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు సందీప్. ఈ చిత్రం వచ్చే నెల సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. గోవా, లండన్ మరియు ఇండియాలోని పలు ప్రాంతాలలో ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు . ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి క్రూ అండ్ కాస్ట్ ని ఎంపిక చేసే పనిలో యూనిట్ ఉందట. కథానాయికగా మలయాళ ప్రేమమ్ చిత్రంలో నటించి మెప్పించిన సాయి పల్లవిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు శేఖర్ కమ్ముల- వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫిదా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మంజుల తెరకెక్కించబోవు చిత్రం అర్బన్ లవ్ స్టోరీగా ఉంటుందని టాక్.