డేట్స్ అండ్ కాఫీ మిల్క్ షేక్ రిసిపి

డేట్స్ అండ్ కాఫీ మిల్క్ షేక్ రిసిపి

మిల్క్ షేక్స్ అనగానే మనకు బనానా మిల్క్ షేక్, బాదం మిల్క్ షేక్, చాక్లెట్ మిల్క్ షేక్ వంటివి గుర్తొస్తుంటాయి. అయితే ఎప్పుడూ ఒకే విధమైన మిల్క్ షేక్స్ ఏంటి. కాస్త వెరైటీగా ప్రయత్నించండి...అలాంటి వెరైటీ మిల్క్ షేక్స్ లో డేట్స్ మరియు కాఫీ మిల్క్ షేక్ ఒకటి. ఖర్జూరాల్లోని స్వీట్ నెస్ ను , ఆరోమా వాసనతో ఫ్రెష్ గా రోస్ట్ చేసిన కాఫీ బీన్ తో కాఫీ కాంబినేషన్ ఒక గ్లాసు డివైన్ తయారవుతుంది. క్రిస్మస్ , న్యూఇయర్ పార్టీకి రెడీ అవుతున్నారా.. మరి అయితే ఒక అద్భుతమైన వెల్ కమ్ డ్రింక్ ను అథితులకు పరిచయడం చేయండి.కాఫీలో కాఫీ కంటే పాలు ఎక్కువగా ఉండేట్లు తయారుచేసి పిల్లలకు అందించినా, ఇక ముందు వారు పాలు తాగమనే మాటే వారి నోట వినిపించదు. అటువంటి అద్భుతమైన టేస్ట్ ఈ కాఫీ షేక్ లో ఉంది. ఈ రిసిపి తయారుచేయడం కూడా సులభం, చాలా సింపుల్ గా సింపుల్ పదార్థాలతో తయారుచేస్తారు. అదెలాగో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు : విత్తనాలు తీసేసిన ఖర్జూరాలు: 1 cup ఇన్ స్టాంట్ కాఫీ పౌడర్ : 10 tbsp పాలు : 6 cups యాలకలు: 5-6 పంచదార 3 tbsp ఫ్రెష్ క్రీమ్: 3/4cup ఐస్ క్యూబ్స్ : కావల్సినన్ని 

తయారుచేయు విధానం : 1. మొదట ఖర్జూరాలలోని విత్తనాలను తొలగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాఫీ డికాషన్ ను తయారుచేసుకోవాలి. అందుకోసం స్టౌ మీద పాన్ పెట్టి, నీళ్ళు పోసి, అందులో కాఫీ పౌడర్ ను వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోనే పంచదార , యాలకలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. పంచదార కరిగే వరకూ స్పూన్ తో కలుపుతూ వేడి చేయాలి. స్టౌవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. ఇప్పుడు అందులో సీడ్ లెస్ డేట్స్, కొద్దిగా పాలు మిక్స్ చేసి, మిక్సిలో వేసి బ్లెండ్ చేయాలి. మెత్తగా పేస్ట్ లా అయ్యే వరకూ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాసులో తీసుకుని, పాలు, ఫ్రెష్ క్రీమ్ మిక్స్ చేయాలి. లేదా మిక్స్ లోనే వేసి మరో మారు బ్లెండ్ చేయాలి. ఈ మిల్క్ షేక్ ను ఒక పెద్ద గ్లాసులో తీసుకుని, కాఫీ డికాషన్ తో డెకరేట్ చేయాలి. డేట్స్, కాఫీ మిల్క్ షేక్ సర్వ్ చేయడానికి రెడీ..