ఆరెంజ్‌ ప్లమ్‌ కేక్‌

ఆరెంజ్‌ ప్లమ్‌ కేక్‌

కావల్సినవి:మైదా- కప్పు, పంచదార పొడి- కప్పు, కోడిగుడ్లు-3, ఆరెంజ్‌ జ్యూస్‌- కప్పు, నూనె- అర కప్పు, వెనిల్లా ఎసెన్స్‌- టీ స్పూను, బేకింగ్‌ పొడి- 2 టీ స్పూన్లు, జీడిపప్పు- రెండు టేబుల్‌ స్పూన్లు, ఎండు ద్రాక్ష- రెండు టేబుల్‌ స్పూన్లు, బాదం- రెండు టేబుల్‌ స్పూన్లు, చెర్రీస్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, టూటీ ఫ్రూటీ ముక్కలు- రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ:

* ఓ గిన్నెలో గుడ్లసొనను తీసుకుని అందులో పంచదార పొడి వేసి బాగా కలపాలి.

* అందులో మైదా, జీడిపప్పు ముక్కలు, ఎండు ద్రాక్ష, బాదం పలుకులు, చెర్రీస్‌, టూటీ ఫ్రూటీ, బేకింగ్‌ పౌడర్‌, వెనిల్లా ఎసెన్స్‌, ఆరెంజ్‌ జ్యూస్‌ వేసి కలుపుకోవాలి. ఇదే మిశ్రమంలోకి నూనె కూడా వేసి బాగా కలపాలి.

* ఇప్పుడు ఓ కేకు పాత్రకు నూనె రాసి కొంచెం మైదా చల్లాలి.

* ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ పాత్రలో వేసి 20 నుంచి 25 నిమిషాల పాటు ఓవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద బేక్‌ చేసుకుంటే రుచికరమైన ఆరెంజ్‌ ప్లమ్‌ కేక్‌ సిద్దమైనట్టే.