బెల్లం ఆవకాయ

బెల్లం ఆవకాయ

కావలసిన పదార్థాలు : 

మామిడికాయ ముక్కలు-2 కిలోలు, 
కారం- 1/2కిలో
ఉప్పు-రుచికి తగినంత, 
ఆవపిండి- అరకిలో, 
బెల్లం-1కిలో, 
నూనె-తగినంత
తయారుచేసే విధానం:
ముందుగా బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి పాత్రలో మామిడి ముక్కల్లో కారం, ఉప్పు, ఆవపిండి, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ముక్కలు తడిసేలా కొద్దిగా నూనె కూడా వేసి మరోసారి కలపాలి. తర్వాత ఈ ముక్కల్ని జాడీలో వేసి, అవి మునిగే వరకూ నూనె పోసి మూత పెట్టేయ్యాలి. బాగా ఊరిన తర్వాత పచ్చడిని తీసుకోవాలి. తాలింపు కూడా వేసుకోవచ్చు. లేదంటే మామూలుగా కూడా బాగుంటుంది.