బ్రెడ్‌ రోల్స్‌

బ్రెడ్‌ రోల్స్‌

కావాల్సిన పదార్థాలు:
బ్రెడ్‌ ముక్కలు -10
వెన్న -1టీ స్పూన్‌
నూనె-2 టేబుల్‌ స్పూన్లు
ఉల్లిపాయతరుగు- 3 టేబుల్‌ స్పూన్లు
క్యాప్సికమ్‌ తరుగు- 3 టేబుల్‌ స్పూన్లు
క్యారెట్‌ తురుము- 2 టేబుల్‌ స్పూన్లు
క్యాబేజ్‌ తరుగు- 1/4 కప్పు
నూడిల్స్‌ ఉడికించినవి- 1/2 కప్పు
పనీర్‌ ముక్కలు-1/4 కప్పు
సోయా సాస్‌-1 టేబుల్‌ స్పూన్‌
పంచదార-1టీ స్పూన్‌
ఉప్పు-తగినంత
మిరియాల పొడి-కొద్దిగా


తయారుచేసే విధానం :
ముందుగా స్టౌపై పాన్‌ పెట్టి కొంచెం నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత ఉల్లి తరుగు, క్యాప్సికం, క్యారెట్‌, క్యాబేజ్‌ తరుగు, ఉప్పు వేసి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న నూడిల్స్‌, సోయా సాస్‌, పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ ముక్కల్ని చపాతీలు వత్తే కర్రతో ఒక్కో స్లైస్‌ని పొడవుగా వత్తి ఒక ప్లేట్‌లో పెట్టాలి. ఒక్కో బ్రెడ్‌ స్టైస్‌లో ఉడికించిన క్యాప్సికం, క్యాబేజ్‌ మిశ్రమాన్ని పెట్టి రోల్‌ చేసి కొద్దిగా నీటితో బ్రెడ్‌ చివర్లని గట్టిగా ప్రెస్‌ చేయాలి. ఒక్కో బ్రెడ్‌ రోల్‌ పై కొద్దిగా వెన్న రాసి పాన్‌పై గోధుమరంగు వచ్చే వరకు రోల్‌ని వేయించాలి. ఇప్పుడు సర్వింగ్‌ ప్లేట్స్‌లో వేడి వేడి బ్రెడ్‌ రోల్స్‌ని వేసి సాస్‌తో సర్వ్‌ చేయండి.