గార్లి‌క్ చికెన్ రైస్‌

గార్లి‌క్ చికెన్ రైస్‌

 కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయలు : పావు కప్పు, 
క్యాప్పికమ్‌ : అర కప్పు, 
వెల్లుల్లి రెబ్బలు : 4, 
రైస్‌ : అర కప్పు, 
వెజిటబుల్‌ ఆయిల్‌ : 2 స్పూన్లు, 
నిమ్మరసం : పావు కప్పు, 
చికెన్‌ బ్రెస్ట్‌ : 1, 
అల్లం : 2 స్పూన్లు, 
సోయాసాస్‌ : 2 స్పూన్లు, 
తేనె : 1 స్పూన్‌, 
చికెన్‌ బ్రోత్‌ : అర కప్పు, 
పార్ల్సీ : 1 స్పూన్‌, 
ఉప్పు : తగినంత.

తయారు చేసే విధానం:
ఒక బౌల్‌ తీసుకుని అందులో చికెన్‌, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, నూనె, ఉప్పు, నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని కలిపి మ్యారినేట్‌ చేసి ఒక గంట పక్కన పెట్టుకోవాలి. డీప్‌ బాటమ్‌ పాన్‌ తీసుకుని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం వేయాలి. తర్వాత అందులోనే ముందుగా మ్యారినేట్‌ చేసి పెట్టుకున్న చికెన్‌ ముక్కలు వేయాలి. తర్వాత బాగా మిక్స్‌ చేయాలి. ఇప్పుడు అందులోనే రెడ్‌ బెల్‌ పెప్పర్‌, సోయాసాస్‌ వేసి మరోసారి మిక్స్‌ చేయాలి. తర్వాత చికెన్‌ ఉడికించిన మ్యారినేట్‌ పోసి, మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి రైస్‌ మెత్తగా ఉడికిందో లేదో చూసి చేసి మెత్తగా ఉడికే వరకు మరోసారి ఉడికించుకోవాలి. చివరగా కొద్దిగా పార్ల్సీ తరుగుతో గార్నిష్‌ చేసి స్టౌ ఆఫ్‌ చేయాలి. అంతే గార్లిక్‌ చికెన్‌ రిసిపి సర్వ్‌ చేయడానికి రెడీ.