మిఠాయిల సంబరం..మోతీచూర్‌ లడ్డు ఇదిగో...!

 మిఠాయిల సంబరం..మోతీచూర్‌ లడ్డు ఇదిగో...!

 కావలసినవి: సెనగపిండి – రెండున్నర కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; పాలు – పావు కప్పు; మిఠాయి రంగు – చిటికెడు; నెయ్యి – డీప్‌ ఫ్రైకి తగినంత; ఏలకుల పొడి – టీ స్పూను; బాదం తరుగు – టేబుల్‌ స్పూను; పిస్తా తరుగు – టేబుల్‌ స్పూను

తయారి:  ∙పంచదారకు మూడు కప్పుల నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చే వరకు ఉడికించి, పక్కన ఉంచాలి  పాలు జత చేసి పొంగే వరకు ఉంచి, దించేయాలి ∙మిఠాయి రంగు జత చేసి, బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో సెనగ పిండి, మూడు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. (ఇష్టపడేవారు మిఠాయి రంగు కలుపుకోవచ్చు) ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి ∙సన్న రంధ్రాలున్న చట్రంలో సెనగ పిండి పోస్తూ సన్న బూందీ నేతిలో పడేలా కదుపుతుండాలి ∙వేయించిన బూందీని బయటకు తీయాలి ∙ఈ విధంగా మొత్తం చేసుకున్నాక, పంచదార పాకంలో వేసి కలపాలి  ఏలకుల పొడి వేసి బాగా కలిపి చేతితో లడ్డు తయారుచేయాలి ∙(ముత్యం పరిమాణంలో బూందీ తయారుచేసి, లడ్డూ చేస్తాం కనుక, ఈ లడ్డూను మోతీచూర్‌ లడ్డూ అంటారు).