మటన్‌ పెప్పర్‌ రోస్ట్‌

మటన్‌ పెప్పర్‌ రోస్ట్‌

 కావాల్సిన పదార్థాలు

మటన్‌ - 1/2 కిలో
పసుపు -1/2 టేబుల్‌ స్పూన్‌
చెక్కా, లవంగాలు - 5
యాలకులు -4, ఉప్పు - తగినంత
నీళ్లు- సరిపడా, ఉల్లి తరుగు -1 కప్పు
టమాటా తరుగు-1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ -2 స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు-1 టేబుల్‌ స్పూన్‌
ధనియాల పొడి - 1 టేబుల్‌ స్పూన్‌
కారం -1 టేబుల్‌ స్పూన్‌
మిరియాల పొడి -3 టేబుల్‌ స్పూన్లు
మెంతులు -1/2 టేబుల్‌ స్పూను
కొత్తిమీర తరుగు- 1/2 కప్పు
ఉప్పు -తగినంత
నూనె -4 టేబుల్‌ స్పూన్లు

తయారుచేసే విధానం: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మటన్‌తో పాటు పసుపు, చెక్క, లవంగాలు,యాలకుల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లుచేర్చి ఉడి కించి పక్కన పెట్టుకోవాలి. కారం, ధనియాల పొడి తోపాటు అన్ని దినుసులని కలిపి మసాలా పేస్టును సిద్ధం చేసుకోవాలి.పాన్‌లో నూనె వేసి ఉల్లి తరుగును బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో ఇంకొంచెం నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చి వాసనపోయే వరకు వేగించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్టును అందులో వేయాలి. ఆ తర్వాత కట్‌ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు మిరియాల పొడిని చల్లి బాగా కలపాలి. కరివేపాకుని కూడా వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లి తరుగును కలపాలి. చివరిగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్‌ను, ఉల్లి తరుగు మిశ్రమాన్ని కుక్కర్‌ గిన్నెలో వేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి. నీళ్లు ఇగిరిపోయి నూనె తేలిన తరువాత దించేస్తే సరి.