పనీర్‌ మెజెస్టిక్‌

పనీర్‌ మెజెస్టిక్‌

  కావాల్సిన పదార్థాలు:

పనీర్‌-100గ్రా
మైదా-2 టేబుల్‌ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్‌ -రెండు టేబుల్‌ స్పూన్లు, కోడిగుడ్డు-1
అజనొమోటో-1/2 టీ స్పూన్‌, మిరియాల పొడి -1/2 టీ స్పూన్‌, ఉప్పు- రుచికి సరిపడా, పచ్చిమిర్చి తరుగు- 1 టేబుల్‌ స్పూన్‌, వెల్లుల్లి తరుగు-1 టేబుల్‌ స్పూన్‌, పుదీనా పేస్ట్‌ -1 టీ స్పూన్‌, ఎండుమిర్చి-2, కారం-1 టేబుల్‌ స్పూన్‌
ఫుడ్‌కలర్‌- నచ్చిన రంగు, నిమ్మకాయ చెక్క-1
నూనె-వేయించుకోడానికి సరిపడా

తయారుచేసే విధానం : పనీర్‌ను పొడవుగా కట్‌ చేయాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్‌, అజనొమోటో, మిరియాలపొడి, కోడి గుడ్డు సొన, ఉప్పు, ఫుడ్‌ కలర్‌ అన్నింటినీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో పనీర్‌ స్టిక్స్‌ని రోల్‌చేయాలి. ముక్కలన్నిటికీ మిశ్రమ పట్టేలా చేసి నూనెలో దోరగా వేయించుకుని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి ముక్కలు, పుదీనా పేస్టు వేయాలి. రెండునిమిషాల తర్వాత నిమ్మరసం, కారం, అజనొమోటో వేసి తాలింపు సమంగా కలిపి ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్‌ స్టిక్స్‌ని కూడా వేసి వేయించి స్టౌవ్‌ కట్టేయాలి. ఐదు నిమిషాల తర్వాత సర్వింగ్‌ ప్లేట్స్‌లోకి పనీర్‌ స్టిక్స్‌ని తీసుకుని కొత్తిమీర, క్యారెట్‌, ఉల్లి తరుగుతో గార్నిష్‌ చేసి పనీర్‌ మెజెస్టిక్స్‌ని అతిధులకందించండి.