టేస్టీగా కాకరకాయ బజ్జీలు

టేస్టీగా కాకరకాయ బజ్జీలు

ప్రతి ఒక్కరికీ వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది..అందుకోసం వెరైటీ వంటకాలు చేస్తూంటారు. ముఖ్యంగా వేడి వేడిగా బజ్జీలు, గారెలు, స్నాక్స్, మొక్క జొన్నలు కాల్చుకొని తింటుంటారు. ఇక బజ్జీల విషయానికి వస్తే ఎన్నో వెరైటీలుగా చేస్తుంటారు. ఇప్పుడు మనం కాకరకాయ బజ్జీలు ఎలా చేస్తారో చూద్దామా!

 కావలసిన పధార్ధాలు :  కాకరకాయలు : రెండు మైదూపిండి : అరకప్పు  బియ్యంపిండి : అరకప్పు  సెనగపిండి : అర కప్పు జీలకర్ర : టీ స్పూన్ కారం : 2 టీ స్పూన్లు మసాలాకారం : 2 టీ స్పూన్లు కొబ్బరితురుము : అరకప్పు  ఉప్పు : టీ స్పూన్ తయారీ చేసేవిధానం : కాకరకాయలు శుభ్రంగా కడిగి ఇష్టంలేక పోతే పై పొట్టు కూడా తీసేసి చక్రాలుగానీ నిలువుముక్కలుగానీ కోయాలి.

వీటికి ఉప్పు రాసి కాసేపు ఎండలో పెట్టాలి. తరవాత భాణలిలో కొద్దిగా నూనె వేసి కాకరకాయ ముక్కలు వేయించి తీయాలి. ఇప్పుడు మైదా, బియ్యం పిండి, సెనగపిండి అన్నీ కలిపి ఈ మిశ్రమంలో జీలకర్ర కారం ఉప్పు,కొబ్బరితురుము, మసాలాకారం వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. వేయించిన కాకరకాయల ముక్కలు పిండిలో ముంచి నూనెలో వేయించి తీయాలి.