ఆకుపచ్చని కూరగాయలు, పండ్లతో ఆరోగ్యం..!

ఆకుపచ్చని కూరగాయలు, పండ్లతో ఆరోగ్యం..!

  కూరగాయలు, పండ్లలో క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటే అప్పుడవి ఆకుపచ్చని రంగును సంతరించుకుంటాయి. ఈ క్రమంలోనే ఆకుపచ్చని రంగులో ఉండే కూరగాయలు, పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఆకుపచ్చని ఆహారాల్లో ఫైటో న్యూట్రియెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును సరిచేస్తాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. 

ఆకుపచ్చని పండ్లు, కూరగాయల్లో ల్యుటేన్, జియాక్సాంథిన్, క్యాల్షియం, ఫోలేట్, విటమిన్ సి, బీటా కెరోటిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. అలాగే బీపీని, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతోపాటు కంటి చూపును మెరుగు పరుస్తాయి. నేత్ర సమస్యలతో బాధపడే వారు నిత్యం ఆకుపచ్చని ఆహారాలను తీసుకుంటే ఫలితం ఉంటుంది. 

ఆకుపచ్చని ఆహారాలను తరచూ తీసుకోడం వల్ల శరీర జీవక్రియలు సక్రమంగా నిర్వహింపబడతాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు. బరువు అదుపులో ఉంటుంది. ఇక ఈ ఆహారాల వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. చురుగ్గా ఉంటారు. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఆకుపచ్చని ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి సంపూర్ణ పోషణ లభిస్తుందని కూడా పరిశోధనలు చెబుతున్నాయి.