భారతీయులు ఎంతో కాలం నుంచి తమ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల్లో గుమ్మడికాయకు ప్రాధాన్యతను కల్పిస్తూ వస్తున్నారు. దీన్ని ఆహార పదార్థంగానే కాక పలు కార్యక్రమాల్లోనూ వాడుతుంటారు. గుమ్మడికాయతో చాలా మంది కూరలు, పచ్చడి, హల్వా, పాయసం వంటి వంటకాలు చేసుకుని ఆరగిస్తుంటారు. అయితే గుమ్మడికాయతో జ్యూస్ చేసుకుని దాన్ని నిత్యం సేవిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గుమ్మడికాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణసమస్యలను పోగొడుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గేందుకు కూడా సహాయ పడుతుంది.
2. వ్యాయామం చేసే వారు గుమ్మడికాయ జ్యూస్ తాగితే మంచిది. దీని వల్ల కండరాలు త్వరగా నిర్మాణమవుతాయి. చక్కని దేహ దారుఢ్యాన్ని పొందవచ్చు.
3. గుమ్మడికాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
4. గుమ్మడికాయలో ఉండే ట్రిప్టోఫాన్ ఒత్తిడిని తగ్గిస్తుంది. మూడ్ మార్చే పదార్థంగా పనిచేస్తుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది.