నెలసరి సమస్యలకు చెక్

నెలసరి సమస్యలకు చెక్

 ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే ఉలువలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. పొట్టను తగ్గించడమే కాదు.. మహిళల్లో తెల్లబట్టను, నెలసరి వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఉలువలతో చేసి ఉండలను తింటే మంచిది. ఉలువలతో చేసిన గంజిని తాగితే ఆరోగ్యానికి బలం చేకూరుతుంది. ఈ గంజి తాగడం వల్ల ఎముకలకు, నరాలకు మేలు జరుగుతుంది. ఉలువలు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. అనవసర కొవ్వు కూడా కరిగిపోతుంది. ఇందులో ఉండే పిండి పదార్థాలకు ఆరోగ్యాన్ని చురుకుగా ఉంచే లక్షణాలున్నాయి. వర్షాకాలంలో ఉలువల సూప్ తాగితే జలుబు వంటివి దరిచేరవు.