పేగులను శుభ్రం చేసే కాలిఫ్లవర్..!

పేగులను శుభ్రం చేసే కాలిఫ్లవర్..!

  కాలిఫ్లవర్ ఈ సీజన్‌లో మనకు ఎక్కువగా లభిస్తుంది. దీన్నే గోబీ అని గోబి పువ్వు అని కూడా పిలుస్తుంటారు. కాలిఫ్లవర్‌లో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. శరీరంలోని వేడిని కాలిఫ్లవర్ తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. కాలిఫ్లవర్ ఆకులను సలాడ్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యం కలుగుతుంది. అలాగే వ్యాధుల బారిన పడ్డవారు కాలిఫ్లవర్ ఆకులను తింటే త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.

1. నిత్య 50 గ్రాముల మోతాదులో కాలిఫ్లవర్ పచ్చి ఆకులను తింటే దంత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి.

2. నిత్యం 50 గ్రాముల కాలిఫ్లవర్ ఆకులను తీసుకుంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. వెంట్రుకలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.

3. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే కాలిఫ్లవర్ రసాన్ని తాగితే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. దీంతోపాటు జీర్ణాశయం, పేగులు శుభ్రంగా మారుతాయి.

4. శరీరంపై ఉన్న గాయాలపై కాలిఫ్లవర్ ఆకుల రసం రాస్తే గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయి.