సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టే....ఆహారాలు..!

సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టే....ఆహారాలు..!

  సీజన్ మారి మరో సీజన్ వస్తుందంటే చాలు.. పలు అనారోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగా ఉంటాయి. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, జ్వరం.. తదితర అనారోగ్య సమస్యలు సీజన్ మారినప్పుడల్లా వస్తూనే ఉంటాయి. అయితే మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా ఈ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 


1. కోడిగుడ్లలో విటమిన్ ఎ, డి ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నిత్యం కోడిగుడ్లను ఆహారంలో భాగం చేసుకుంటే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 

2. పాలకూర, పుంటికూర, మెంతి కూర, మునగ ఆకులు.. తదితర ఆకు కూరలను బాగా తీసుకోవాలి. వాటిల్లో ఉండే ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 

3. స్వీట్‌కార్న్‌లో విటమిన్ బి12, ఫైబర్ అధికంగా ఉంటాయి. స్వీట్ కార్న్‌ను తరచూ తీసుకున్నా శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

4. వాల్‌నట్స్, బాదంపప్పు, పల్లీలు, పొద్దు తిరుగుడు, గుమ్మడి విత్తనాల్లో విటమిన్ ఎ, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడమే కాక, ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి మనల్ని రక్షిస్తాయి. 

5. నిత్యం ఉదయాన్నే పరగడుపునే నాలుగు తులసి ఆకులను తినడం వల్ల లేదా రెండు టీస్పూన్ల అల్లం రసం, ఉసిరి కాయ రసం తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తిని బాగా పెంచుకోవచ్చు.