వారానికి రెండు రోజులు అలా చేస్తే..

వారానికి రెండు రోజులు అలా చేస్తే..

  లండన్‌ : మారుతున్న జీవన శైలితో చిరుప్రాయంలోనే వ్యాధులు దాడిచేస్తున్న క్రమంలో మెరుగైన మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారంలో రెండు రోజుల పాటు తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తప్పించుకోవచ్చని యూనవర్సిటీ ఆఫ్‌ సర్రేకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 5:2 డైట్‌గా పేరొందిన ఈ ఆహారాన్ని వైద్య నిపుణులు పెద్ద ఎత్తున సిఫార్సు చేస్తున్నారు.

సాధారణ క్యాలరీల కంటే తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారాన్ని వారంలో రెండు రోజులు తీసుకుంటే జీవక్రియల వేగం పుంజుకుంటుందని వారు చెబుతున్నారు. 5:2 డైట్‌ ద్వారా శరీరంలో హానికారక కొవ్వులను సులబంగా తొలగించుకోవచ్చని పరిశోధకులు తేల్చారు. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో కార్డియోవాస్క్యులర్‌ జబ్బుతో పాటు ఇతర హృదయ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఒబెసిటీతో బాధపడుతున్నవారితో పాటు ఇతరులపై పరిశోధకులు జరిపిన క్యాలరీ లెక్కింపులో ఈ ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. అథ్యయన వివరాలు బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌లో ప్రచురితమయ్యాయి.