యోగా చేస్తున్న ప్రెగ్నెంట్ స్టార్‌

యోగా చేస్తున్న ప్రెగ్నెంట్ స్టార్‌

 ముంబై: సోహా అలీ ఖాన్ ఇప్పుడు ప్రెగ్నెంట్‌. అయినా ఆమె యోగా చేయ‌డం మాన‌డం లేదు. త్వ‌ర‌లో సోహా మొద‌టి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న‌ది. మ‌మ్మీ కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ ఇంకా చాలా క్యూటీగానే క‌నిపిస్తున్న‌ది. ప్రెగ్నెన్సీ స‌మ‌యంలోనూ సోహా చాలా ఫిట్‌గా క‌న‌బ‌డ‌డానికి కార‌ణం ఏంటో తెలిసిపోయింది. ఈ హిందీ ఫిల్మ్ స్టార్ యోగాతో త‌న బాడీని ఫిట్‌గా ఉంచుకుంటోంది. యోగా ఫోటోల‌ను సోహా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే యోగా ట్రైన‌ర్ ద‌గ్గ‌ర ఆమె శిక్ష‌ణ తీసుకుంటున్న‌ది. ఒక‌వేళ మీరేమైనా సోహా అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌నుకుంటే, ట్రైన‌ర్‌ను సంప్ర‌దించ‌డం బెస్ట్‌.