ప్రతి ఐదు నిమిషాల వ్యవధిలో ఒక బస్సు.

ప్రతి ఐదు నిమిషాల వ్యవధిలో ఒక బస్సు.

ప్రతి ఐదు నిమిషాల వ్యవధిలో ఒక బస్సు.

హైదరాబాద్ సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్, నమస్తే తెలంగాణ: కృష్ణా పుష్కరాలకు వెళ్లే యాత్రికుల కోసం టీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. హైదరాబాద్ నుంచి నాలుగు వందల ప్రత్యేక బస్సులను పుష్కరాల కోసం నడపాలని నిర్ణయించింది. నగరంలోని 13 ముఖ్యమైన కేంద్రాల నుంచి ఇవి వివిధ పుష్కర ఘాట్లకు బయలుదేరనున్నాయి. 
ఈ బస్సులు ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు నడుస్తాయి. ఎంజీబీఎస్ బస్ట్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రీజియన్ మేనేజర్ ఆర్ గంగాధర్ ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీశైలం, బీచుపల్లి, నాగార్జునసాగర్, విజయవాడ ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి ప్రతీ ఐదు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసామని చెప్పారు. రద్దీని అనుసరించి అవసరమైతే బస్సుల సంఖ్య పెంచుతామని తెలిపారు. 30 మంది ప్రయాణికులు కలిసి బస్సు బుక్ చేసుకుంటే వారి ఇంటివద్దకే బస్సును పంపిస్తామని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా పుష్కర ఘాట్ల వద్దకు తీసుకెళ్లి, తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ప్రయాణికులకు సహకరించేందుకు టీఎస్‌ఆర్టీసీ బృందాలు పుష్కరఘాట్ల వద్ద అందుబాటులో ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ నగర ప్రజల కోసం ప్రత్యేక కంట్రోలర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కర యాత్రికులు తమ టికెట్లను ఆన్‌లైన్‌లోకూడా రిజర్వు చేసుకోవచ్చని తెలిపారు. అందుకు WWW.TSRTC ONLINE.IN వెబ్‌సైట్‌ను చూడాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీటీఎం విజయభాను, సీఆర్‌ఎం భవానీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.