55ఏళ్ల దర్శకుడ్ని పెళ్లాడిన పాప్‌  గాయని

55ఏళ్ల దర్శకుడ్ని పెళ్లాడిన పాప్‌  గాయని

 ఆ దర్శకుడి వయసు 55ఏళ్లు. ఓ మోడల్‌కి 35 సంవత్సరాలు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమంలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ పెళ్లి కుమారుడే హాలీవుడ్‌ డైరెక్టర్‌ క్వాంటిన్‌ తరంటినో. వధువు ప్రముఖ హాలీవుడ్‌ పాప్‌ గాయని, మోడల్‌ దానియోల్‌ పిక్‌. వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్‌లో ఉండి ఎటువంటి ఆర్భాటమూ లేకుండా లాస్‌ఏంజెల్స్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ వార్తను పీపుల్‌ మ్యాగజైన్‌ ప్రచురించింది. వీరిద్దరూ 2009లో ఓ కార్యక్రమంలో మొదటిసారిగా కలుసుకున్నారు. అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. గత ఏడాది జూన్‌లో నిశ్చితార్థం జరిగింది. ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్నారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో నిశ్చితార్థం పార్టీ కూడా ఇచ్చారట. ఈ దర్శకుడు బ్రూస్‌ విల్లీస్‌, సామ్యూల్‌ ఎల్‌ జాక్సన్‌, ఎమా తుర్మాన్‌ వంటి నటులతో సినిమాలు తీశారు.