అతి చిన్న వయసులోనే నటుడు మృతి

అతి చిన్న వయసులోనే నటుడు మృతి

  అతి చిన్న వయసులోనే హాలీవుడ్‌ నటుడు, సంగీతకారుడు జాక్సన్ వోడెల్(20) మృతి చెందారు. యూఎస్‌ టీవీ సిరీస్‌ ది గోల్డ్‌బెర్గ్స్‌ తో వోడెల్‌ ఎక్కువగా ప్రాచుర్యం పొందారు. జూన్‌ 8న శాన్‌ ఫెర్నాండో వ్యాలీలో తర్జానా రెసిడెన్సీలో అనుమానాస్పదంగా వోడెల్‌ మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్టు వైరెటీకి లాస్‌ ఏంజెల్స్‌ కంట్రీ కార్నర్స్‌ ఆఫీసు ధృవీకరించింది. ఏ కారణంతో ఆయన మృతి చెందారో ఇంకా తెలియరాలేదు. శవపరీక్ష కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంచారు. వోడెల్‌ నటుడిగా, సంగీతకారుడిగా రాణించడమే కాకుండా.. గేయ రచయితగా కూడా పేరులోకి వచ్చారు. ‘ఫరెవర్‌ మై గర్ల్‌’ అనే రోమాంటిక్‌ డ్రామాకు సౌండ్‌ట్రాక్‌ కూడా అందించారు. ఈ ఏడాదే ఈ సినిమా విడుదలైంది. 

వోడెల్‌ ట్విటర్‌ అకౌంట్‌లో ఆయన కుటుంబ సభ్యులు ఉద్వేగభరితంగా ఓ పోస్టు చేశారు. ఎప్పటికీ వోడెల్‌ ఓ తారలా మెరుస్తూ, తెలివైన వాడిగా ఉంటారని అన్నారు. ఎప్పటికీ తాము ప్రేమించే, నైపుణ్యం గల ఆత్మవి నీవేనని పేర్కొన్నారు. 'అతను చాలా పంచుకున్నారు. మా కుటుంబం ఎప్పుడూ నిజాన్నే ముందుకు తీసుకెళ్తుంది. వోడెల్‌ను ప్రేమించే మిగతా ప్రపంచం కూడా అలాగే ఉంటుంది' అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. వోడెల్‌ మృతికి చార్లీ డీప్యూ నివాళులర్పించారు. ఎవరైనా చనిపోయారని తెలిస్తే గుండె బరువెక్కుతుందని, కానీ చాలా చిన్నవారు చనిపోవడం కూడా నిజంగా ఎంతో బాధకరమని మోడరన్‌ ఫ్యామిలీ నటి ఏరియల్‌ వింటర్‌ కూడా తెలిపారు.