‘హ్యారీపోటర్‌’ నుంచి రుపెర్ట్‌ నిష్క్రమణ

‘హ్యారీపోటర్‌’ నుంచి రుపెర్ట్‌ నిష్క్రమణ

 బ్రిటిష్‌ అమెరికన్‌ సినిమా 'హ్యారీపోటర్‌'. ఈ పేరు పిల్లలకు పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే ఈ చిత్రానికి అంత క్రేజ్‌ మరి. జేకే రోలింగ్‌ రచించిన హ్యారీపోటర్‌ ఆధారంగా ఈ సినిమాను సిరీస్‌గా రూపొందించుకుంటూ వస్తున్నారు. హ్యారీపోటర్‌గా రాడ్‌క్లిఫ్‌, రోన్‌ వెస్లీగా రుపెర్ట్‌ గ్రింట్‌, ఇమ్మా మాట్సాన్‌గా మెర్మీయానే గ్రాంగర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో బాల్యం నుంచి నటిస్తోన్న రుపెర్ట్‌ గ్రింట్‌ ఇక నుంచి రోన్‌ వెస్లీ పాత్రలో కనిపించడు. ఆ సిరీస్‌ నుంచి ఆయన తప్పుకున్నారు. తనకు ఉపసమనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ''ఇది (హ్యారీపోటర్‌ సిరీస్‌) జైలు కాదు. అందువల్ల ఆ ఆ సిరీస్‌ నుంచి ఎప్పుడూ బయటకు రావాలనుకోలేదు. కానీ ఎందుకో బయటకొచ్చేశాను. కొత్త గాలి కోసం వచ్చాను. ఇలా రావడాన్ని నేను ఆనందంగాన్నే భావిస్తున్నా'' అని తెలిపారు.