>

హీరోయిన్ పై పొరుగువారి మండిపాటు

హీరోయిన్ పై పొరుగువారి మండిపాటు

  లాస్ ఏంజిల్స్: బ్రాడ్ పీట్ తో తెగదెంపులు చేసుకున్న హాలీవుడ్‌ హీరోయిన్‌ ఎంజెలీనా జోలీ ఇటీవల ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. లాస్ ఏంజిల్స్ లోని లాస్ ఫెలిజ్ ఏరియాలో 25 మిలియన్ డాలర్లను వెచ్చించి మరీ ఆ ఇంటిని ఎంజెలీనా ముచ్చటపడి తీసుకుంది.


వారం రోజుల కిందటే తన ఆరుగురు పిల్లలతో కలిసి ఎంజెలీనా ఆ ఇంటిలోకి వెళ్లింది. అయితే.. లాస్ ఫెలిజ్ లోని పొరుగువారు మాత్రం ఎంజిలీనాపై మండిపడుతున్నారు. ఇంతకు ముందు ప్రశాంతంగా ఉన్న తమ ప్రైవేట్ ఎస్టేట్ కాస్తా హీరోయిన్ రాకతో గందరగోళంగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏంజిలీనా వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయిందని వాపోతున్నారు. అసలు అక్కడ ఎంజెలీనా ఇల్లు తీసుకోవడం ఏమాత్రం సరికాదని ఇరుగుపొరుగువారు అభిప్రాయపడుతున్నారు. ఇతర సెలబ్రిటీలు సైతం ఆ ప్రాంతంలో ఉంటున్నా.. ఎంజిలీనాపై ఉన్న ఎక్కువ అటెన్షన్‌ సమస్యలకు కారణమౌతున్నట్లు తెలుస్తోంది.


Loading...