హాలీవుడ్ నటిని పాము కరిచిందట..

హాలీవుడ్ నటిని పాము కరిచిందట..

  లాస్‌ఏంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి లిండ్సే లోహన్‌ను పాము కరిచిందట. ఈ విషయాన్ని లిండ్సే లోహన్ వెల్లడించింది. టూర్ వెకేషన్ ట్రిప్‌లో భాగంగా అండమాన్ సముద్ర ప్రాంతంలోని అందమైన ఫుకెట్ ఐలాండ్‌పైకి ఎక్కుతుండగా పాము కరిచిందని ‘మీన్ గర్ల్స్’ బ్యూటీ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. అయితే తన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని..ప్రస్తుతం తాను సురక్షితంగా ఉన్నానని ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా లిండ్సే లోహన్‌ వెల్లడించింది. ఫుకెట్ చాలా అందమైన, అద్భుతమైన ప్రదేశం. ఈ ప్రదేశమంటే నాకు ఎంతో ఇష్టం. అందరికీ న్యూఇయర్ విషెస్. దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని భావిస్తున్నానని కామెంట్స్ చేసింది లిండ్సే లోహన్.