బీచ్ అండ్ బికినీలో త్రిధా చౌదరీ.

బీచ్ అండ్ బికినీలో త్రిధా చౌదరీ.

కొత్తదనానికి తెలుగు తెర ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే వుంటుంది. అందులో భాగంగానే ఎంతోమంది అందమైన కథానాయికలు ఇక్కడి తెరపై మెరుస్తుంటారు. అయితే అందంతో పాటు అభినయం ఉన్నవారు .. దానికి తోడు సక్సెస్ ని అందుకున్నవారు ఇక్కడ నిలదొక్కుకుంటూ వుంటారు. అలా ఈ మధ్య తెలుగు తెరని పరిచయం చేసుకుని, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయికలలో 'త్రిధా చౌదరి' కూడా ఒకరు. సూర్య వర్సెస్ సూర్య సినిమాలో నిఖిల్ హీరోయిన్ గా నటించిన ఈ బెంగాలీ భామ హాలిడే అంటే చాలు.. ఎగిరి గంతులేస్తుందట.

ప్రస్తుతం ఈ భామ గోవాలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. బీచ్ ఒడ్డున బికినీలో రిలాక్స్ అయిపోతూ.. ఫోటోలు తీయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. బాగా బద్ధకంగా ఉందంటూ పోస్ట్ చేసిన త్రిధా చౌదరి.. సముద్రపు గాలులతో పాటు సూర్యుడి వేడిని కూడా అనుభవిస్తోందట. ఇక్కడి సినిమాల్లో కాసింత పద్ధతిగానే కనిపించింది కానీ.. గోవా వెళ్లి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాక.. అందులోనూ గ్లామర్ హీరోయిన్ అన్నాక ఏ రేంజ్ లో చెలరేగిపోవాలో.. అంతా చూపించేస్తోంది త్రిధా. బీచ్ సిటీలో ఎంజాయ్ మెంట్ లో ఎలా చేయాలో నన్ను చూసి నేర్చుకోండి అన్నట్లుగా ఉంది ఈ బెంగాలి అమ్మడి వాలకం! 

ఆల్రెడీ ఒక ప్రక్కన చలి చంపేస్తుంటే.. ఈ సెక్సీ చౌదరి పిల్ల మాత్రం సముద్రాన్ని వేడెక్కించడానికి బ్యాగ్ వేసుకుని గోవా బయల్దేరింది. అక్కడి నార్త్ గోవా లోని ఆష్వెమ్ బీచ్ లో అమ్మడు తన టూ పీస్ కు పని చెప్పింది. బికినీలోకి స్లిప్పయ్యి.. అటునుండి సముద్ర ఒడ్డున అలల్లో ఆడుకుంటూ.. తన వయ్యారాల వడ్డనతో నీటి అంచులను వేడెక్కిస్తూ.. మనకి కైపెక్కిస్తూ.. చెంగు చెంగుమని గెంతుతుంటే.. అబ్బో కంట్రోల్ చేసుకోవడం కష్టమండి. అదేనండీ ఈ ఫోజులను మళ్ళీ మళ్ళీ చూడకుండా ఉండటం అనేది ఒక కంట్రోల్ చేసుకోలేని విషయం కదా.

సూర్య వర్సెస్ సూర్య అంటూ నిఖిల్ సరసన టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. మళ్లీ ఇక్కడ కనిపించలేదు. మంచి హిట్టే అందుకున్నా పాపం త్రిధా కి ఆఫర్లు మాత్రం పెద్దగా రాలేదు ఆ తర్వాత అడపాదడపా చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడటం.., మొదలయ్యే దాకా వచ్చీ అటకెక్కేయటంతో అమ్మడు కూడా మూటా ముల్లే సర్దేసి తిరిగి బెంగాలీ సినిమాలు చేసుకుంటోంది, బుల్లితెరమీదకి కూడా వచ్చేసింది. టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు మాంచి బిజీగానే ఉంది మరి.