>

భూమిక కండ‌లు చూశారా !

భూమిక కండ‌లు చూశారా !

న్యూఢిల్లీ: భూమికా శ‌ర్మ. ఈమె అందం నాజూకు కాదు. కండ‌లు తిరిగిన బాడీ ఈమె బ్యూటీ. వెనిస్‌లో జ‌రిగిన మిస్ వ‌ర‌ల్డ్ బాడీబిల్డింగ్ చాంపియ‌న్స్‌షిప్‌ను గెలుచుకున్న‌ది భూమికా శ‌ర్మ‌. ఈమె వ‌య‌సు 21 ఏళ్లు. పుట్టింది డెహ్రాడూన్‌లో. బాడీ పోజింగ్‌, వ్య‌క్తిగ‌త పోజింగ్‌, మిగ‌తా క్యాట‌గిరీల‌ను క‌లుపుకుని భూమిక ఆ పోటీల్లో టాప్‌గా నిలిచింది. ప్ర‌పంచ దేశాల నుంచి సుమారు 50 మంది మ‌హిళ‌లు ఈ ఈవెంట్‌లో పోటీప‌డ్డారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టోర్న‌మెంట్‌లో 27 మంది భార‌తీయ మ‌హిళ‌లు పాల్గొన్నారు. త‌ల్లి హ‌న్సా మ‌న్ర‌ల్ శ‌ర్మ ప్రోత్సాహంతోనే భూమిక బాడీ బిల్డ‌ర్‌గా మారింది. హ‌న్సా మ‌న్ర‌ల్ గ‌తంలో భార‌తీయ మ‌హిళ‌ల రెజ్లింగ్ టీమ్‌కు కోచ్‌గా వ్య‌వ‌హ‌రించింది. భూమిక ప్ర‌తి రోజో ఏడు గంట‌ల పాటు జిమ్ చేస్తుంది. కోచ్ భూపేంద్ర శ‌ర్మ నేతృత్వంలో ఆమె వ‌ర్కౌట్ సాగుతుంది. మిస్ వ‌ర‌ల్డ్ బాడీ బిల్డింగ్ గెలిచిన భూమిక ఇప్పుడు త‌న టార్గెట్‌ను మిస్ యూనివ‌ర్స్ టైటిల్‌పై పెట్టింది.