‘బికినీ’ ఫొటో షేర్ చేసి.. కోపంగా మాట్లాడిన సమంత! 

‘బికినీ’ ఫొటో షేర్ చేసి.. కోపంగా మాట్లాడిన సమంత! 

అక్కినేని కుటుంబానికి కోడలు కాబోతున్నా సినిమాలను తగ్గించేది లేదని ఇదివరకే స్పష్టం చేసింది సమంత. అంతేకాదు ఇంతకుముందులాగానే గ్లామరస్‌గానే కనబడతానని కూడా తేల్చిచెప్పింది. అన్నట్టుగానే నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా కొన్ని హాట్‌హాట్‌ ఫోటోషూట్లలో పాల్గొంది. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఓ బికినీ ఫోటోను షేర్‌ చేసింది.

బికినీ ఫోటో అంటే.. బికినీ వేసుకుని ఫోటోకు ఫోజివ్వడం కాదు.. కేవలం తన బికినీని మాత్రమే షేర్‌ చేసింది. అయితే ఈ ఫోటో షేర్‌ చేసినందుకే ఓ వ్యక్తి సమంతపై విరుచుకుపడ్డాడు. దీనికి సమంత ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘క్యారెక్టర్‌నుబట్టి కాకుండా డ్రెస్‌ను బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని డిసైడ్‌ చేసే నీలాంటి వాళ్లును చూస్తే సిగ్గుగా ఉంద’ని సమాధానం ఇచ్చింది.

‘‘మీరు అక్కినేని ఫ్యామిలీలో మెంబర్ కాబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న మీరు.. బాలీవుడ్ వాళ్లలాగా చేయకండి.. సౌత్ ఇండియన్‌లాగే ఉండండి. నార్త్ ఇండియన్‌లా బిహేవ్ చేయకండి’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.