బికినీలో క‌రిష్మా.. వైర‌ల్ ఫోటో 

బికినీలో క‌రిష్మా.. వైర‌ల్ ఫోటో 

 42 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీ క‌రిష్మా క‌పూర్ ప్ర‌స్తుతం యూర‌ప్ టూర్ ను తెగ ఎంజాయ్ చేస్తున్న‌ది. యూర‌ప్ తో ఓ వింటేజ్ కారులో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోల‌ను త‌న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. అంతే కాదు.. బ్లాక్ బికినీ వేసుకున్న ఫోటోను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అది సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది.

గ‌త సంవ‌త్స‌ర‌మే క‌రిష్మా డైవ‌ర్స్ తీసుకుంది. ప్ర‌స్తుతం ముంబ‌యి కి చెందిన బిజినెస్ మేన్ సందీప్ తొషిన్వాల్ తో క‌రిష్మా డేటింగ్ చేస్తున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. చివ‌రి సారిగా 2013 లో బాంబే టాకీస్ మూవీలో కామియో రోల్ చేసింది. మ‌ళ్లీ బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయ‌డానికి అమ్మ‌డు ప్లాన్ చేస్తున్న‌ద‌ట‌. 1997 లో స‌ల్మాన్ తో క‌రిష్మా న‌టించిన మూవీ జుడ్వా కు కొన‌సాగింపుగా రానున్న మూవీ లో న‌టించనున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి.