>

మరో వివాదంలో సోఫియా హయత్

మరో వివాదంలో సోఫియా హయత్

 బిగ్ బాస్ టీవీ షోతో పాపులర్ అయిన ఈ భామ, హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను హిటెక్కించింది. తరువాత అన్ని వదిలేసి మదర్ గాయాగా మారిపోయానంటూ షాక్ ఇచ్చింది. తరువాత మరోసారి మాట మార్చి పెళ్లి రెడీ అయిపోయింది. తనకు కాబోయే భర్తతో కలిసి మక్కా యాత్ర చేసిన ఈ బ్యూటి అక్కడ తనను వేదించారంటూ మరోసారి వివాదానికి తెర తీసింది.


ఇలా రోజుకో వివాదంతో హల్ చల్ చేసిన సోఫియా.. ఇటీవలే వ్లాట్ స్టానెస్ ను పెళ్లాడింది. అయితే పెళ్లి తరువాత మరింత దూకుడు పెంచిన సోఫియా తన భర్తతో సన్నిహితంగా ఉన్న వీడియోను రిలీజ్ చేసింది. ఇలాంటి వీడియోలు ఆన్ లైన్ లో ఎన్నో ఉన్న సోఫియా పోస్ట్ చేసిన వీడియో మాత్రం మరోసారి వివాదానికి కారణమయ్యింది.  గతంలో తన కాలు మీద స్వస్థిక్ గుర్తు టాటూ వేయించుకోవటం పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా విడుదల చేసిన వీడియోలోనూ హిందూ దేవుళ్లను చూపించటంపై వివాదం మొదలైంది.

సమాజిక కార్యకర్త అసద్ పటేల్ ఈ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో హిందువుల మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందంటూ, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వివాదం పై సోఫియా హయత్ ఇంకా స్పందించలేదు.