>

పెళ్లికి ముందే పిల్లల్ని కంటాను: శృతి హాసన్

పెళ్లికి ముందే పిల్లల్ని కంటాను: శృతి హాసన్

హైదరాబాద్: పిల్లలు కనడానికి పెళ్లి తప్పకుండా చేసుకోవాలనే రూల్ ఎక్కడా లేదని.... అందుకే పెళ్లికి, పిల్లలకు తాను ఎప్పుడూ ముడి పెట్టబోనని హీరోయిన్ శృతి హాసన్ అంటోంది. ఈ విషయంలో తన తల్లిదండ్రులే తనకు ఆదర్శమని శృతి హాసన్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలో లేను, బాయ్ ఫ్రెండ్ కోసం కేటాయించేంత సమయం నా వద్ద లేదు, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు అని చెప్పిన శృతి హాసన్.... గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ మీద మనసు పడ్డానని, అతడితో కలిసి తిరిగానని తెలిపింది. 

 ఆ మ్యూజిర్ డైరెక్టర్ పేరు చెప్పకుండా తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పుకొచ్చింది శృతి. అతడు చాలా మంచి వాడు, మేము చాలా క్లోజ్ గా ఉండే వాళ్లం. తర్వాత కొన్ని కారణాలతో విడిపోయాం. విడిపోయాక అర్థమయింది.... అతడిపై తనకు ఉన్నది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ మాత్రమే అని శృతి హాసన్ తెలిపారు. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్న నా కుటుంబం నుండి పూర్తి సపోర్టు ఉంటుంది. చిన్నప్పటి నుండి నేను, చెల్లి ఇండిపెండెంటుగానే పెరిగాం, సొంతగా నిర్ణయాలు తీసుకోవడం చిన్నతనం నుండే నేర్చుకున్నామని శృతి హాసన్ తెలిపారు.

 నా పై మీడియాలో ఎలాంటి రూమర్స్ వచ్చినా ఇంట్లో వాళ్లు పట్టించుకోరు. ఎందుకంటే అవి కేవలం రూమర్స్ మాత్రమే అని వారికి తెలుసు. ఏదైనా విషయం ఉంటే నేను ముందే కుటుంబ సభ్యులతో పంచుకుంటాను.... మా మధ్య అంత అడర్ స్టాండింగ్ ఉంటుంది అని శృతి హాసన్ అన్నారు.

 శృతి హాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారే. ఇద్దరూ పెళ్లికి ముందే ప్రేమలో పడ్డారు. సహజీవనం చేసారు. ఆ సమయంలోనే శృతి హాసన్ జన్మించింది. తర్వాత పెళ్లి చేసుకున్న వారు..... అక్షర్ హాసన్ జన్మించిన తర్వాత కొన్నాళ్లకు విడిపోయిన సంగతి తెలిసిందే.

 


Loading...