>

సంచలనంగా మారిన అందగత్తె..  

సంచలనంగా మారిన అందగత్తె..  

 మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన ఓ అందగత్తె ఇంటర్‌‌నెట్‌లో పెను సంచలనంగా మారింది. తక్కువ సమయంలోనే అసంఖ్యాకమైన అభిమానులను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అంతేకాకుండా కుర్రకారు యువకులను ఫిదా చేస్తోంది. నెటీజన్లు అందరితోనూ ‘వారెవ్వా.. వాట్ ఏ బ్యూటీ’ అనిపించుకుంటోంది. ఎంతోమంది అందగత్తెలను చూశాం, అందాల గురించి విన్నాం.. ఇంతలా పొగడడానికి కొత్తగా అందగత్తె వద్ద ఏముందబ్బా అనుకుంటున్నారా?.. ఆమె వివరాలు తెలిస్తే ఎవరైనా వావ్.. అనకుండా ఉండలేరు. 


ఆకట్టుకునే అందగత్తె వివరాలు..
అందరితోనూ ప్రశంసించబడతున్న ఈ అందగత్తె పేరు కరోలిన్ హర్జ్. వయసు ఓ 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందిలే అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఆమె వయసు 70 సంవత్సరాలు. నమ్మశక్యం అయినా కాకపోయినా ఆమె వయసు అక్షరాలా 70 సంవత్సరాలు. దీంతో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. సోషల్ మీడియాలో కరోలిన్ ఓ సంచలనంగా మారింది. ఆమె వయసు గురించి తెలిసిన వారందరూ నోరెళ్లబెడుతున్నారు.

నమ్మశక్యంగా లేదంటూ ఆశ్చర్యపోతున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత అందమైన, సెక్సీయస్ట్ అమ్మమ్మ’ అంటూ పొగుడుతున్నారు. నెటీజన్ల కామెంట్లపై కరోలిన్ స్పందించింది. షుగర్ వ్యాధి రావడంతో 28 సంవత్సరాల నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నానని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నానని తెలిపింది. ఈ ఆహారపు అలవాట్ల వల్లే ఇంత అందంగా కనిపిస్తున్నానని చెప్పింది. మంచి ఆహారం తీసుకుంటే అందాన్ని సొంతం చేసుకోవచ్చంటూ యువతులకు ఓ సలహా కూడా ఇచ్చింది ఈ 70 ఏళ్ల అందగత్తె..


Loading...