మొబైల్ ఫోన్లలో కొత్త సూక్ష్మక్రిముల జాతులు

మొబైల్ ఫోన్లలో కొత్త సూక్ష్మక్రిముల జాతులు

 పుణె: టాయిలెట్లలో కన్నా మొబైల్ పోన్లలో ఎక్కువగా సూక్ష్మక్రిములు ఉన్నాయని కొన్నేండ్ల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే తొలిసారిగా పుణె శాస్త్రవేత్తలు మూడు కొత్త సూక్ష్మక్రిముల జాతులు మొబైల్ ఫోన్లలో ఉన్నట్టు కనుగొన్నారు. లైసిన్‌బసిల్లాస్ టెలిఫోనికస్, మైక్రోబ్యాక్టీరియమ్ టెలిఫోనికమ్ అనే బ్యాక్టీరియాలు, పైరెనొచేట టెలిఫోని అనే శిలీంధ్రాన్ని కనుకొన్నారు. పుణె జాతీయ కేంద్రంలో 27 ఫోన్ శాంపిల్స్ సేకరించి అందులో 543 సూక్ష్మక్రిములు ఉన్నట్టు కనుగొన్నారు. ఇందు లో 515 రకాల బ్యాక్టీరియా, 30 రకాల శిలీంధ్రాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. అయితే వీటిలో చాలా సూక్ష్మక్రిముల వల్ల మనుషులకు ఎలాంటి హాని జరుగదని వారు పేర్కొన్నారు.