19 ఏండ్ల తర్వాత కాంగ్రెస్‌లోకి తారిఖ్ అన్వర్

19 ఏండ్ల తర్వాత కాంగ్రెస్‌లోకి తారిఖ్ అన్వర్

  న్యూఢిల్లీ: నెల క్రితం ఎన్సీపీ నుంచి బయటికొచ్చిన తారిఖ్ అన్వర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు 19 ఏండ్ల తర్వాత ఆయన సొంత గూటికి చేరారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత తారిఖ్ అన్వర్ ఆ పార్టీలో చేరారు. బీహార్‌లోని కతిహార్ లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన తారిఖ్ అన్వర్ 2012లో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ శరద్‌పవార్, పీఏ సంగ్మాలతో కలిసి 1999లో ఎస్సీపీని ఏర్పాటు చేశారు.