ఐదు రోజుల పాటు సమ్మె విరమించండి

ఐదు రోజుల పాటు సమ్మె విరమించండి

  చెన్నై : తమిళనాడు రవాణా కార్మికుల సమ్మె గురువారానికి ఎనిమిదోరోజుకి చేరుకుంది. జనవరి 14న పొంగల్‌ జరుపుకునేందుకు తమ సొంత ఊళ్లకు బయలుదేరే తమిళయన్స్‌కి ప్రయాణం ప్రశ్నార్థకమైంది. దీంతో మద్రాసు హైకోర్టు పొంగల్‌ పండుగను దృష్టిలో ఉంచుకుని గురువారం నుండి ఐదురోజులపాటు బస్సులను నడపాలని వివిధ రవాణా కార్మికుల సంఘాలను ఆదేశించింది. రవాణా సంఘాలు తమ నిర్నయాన్ని గురువారం తెలపాలని కోరింది. పొంగల్‌సీజన్‌లో ఇతర ప్రాంతాలలో నివసించేవారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లి పండుగను జరుపుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళుతుంటారు. 

దీంతో రద్దీ ఎక్కువగా వుంటుంది. వాహనాలను నడపడానికి సరైన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన తాత్కాలిక డ్రైవర్లను నియమించడం ద్వారా పరిస్థితిని పరిష్కరించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వేతన పెంపుకు సంబంధించి ప్రభుత్వానికి, రవాణా సంఘాలకు మధ్య చర్చలు కొలిక్కి రావడంలేదు. బుదవారం తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి 750 కోట్ల రవాణా కార్మికుల రిటైర్మెంట్‌ బకాయిలు ఈ వారంలో విడుదల చేస్తామని, ఆందోళన ఉపసంహరించుకోవాలని కోరారు.