ఐక్యరాజ్య సమితి నివేదికను ఖండించిన భారత్‌

ఐక్యరాజ్య సమితి నివేదికను ఖండించిన భారత్‌

  న్యూఢిల్లీ : కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదికను 'నమ్మరాని, వివాదాస్పదమైన, దురుద్దేశంతో కూడిన' నివేదికగా భారత్‌ పేర్కొంది. తప్పుడు కథనాన్ని ఇస్తూ దురభిప్రాయాన్ని కలగచేసేలా వుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీస్తోందని విమర్శించింది. భారత్‌ ఈ నివేదికను తిరస్కరిస్తోందని, ఇటువంటి నివేదికను ఇప్పుడు వెలువరించడంలో ఉద్దేశ్యాన్ని ప్రశ్నిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. నిర్ధారించబడని సమాచారంతో ఈ నివేదిక నిండివుందని విమర్శించింది. జమ్మూ కాశ్మీర్‌ భారతదేశంలోని అంతర్భాగం. దురాక్రమణ ద్వారా పాకిస్తాన్‌ కొంత భాగాన్ని బలవంతంగా ఆక్రమించిందని విదేశాంగ శాఖ పేర్కొంది.