అంబానీ చౌకీదారుగా మోడీ

అంబానీ చౌకీదారుగా మోడీ

  న్యూఢిల్లీ : అనీల్‌ అంబానీకి 'చౌకీదార్‌' (కాపలాదారు)గా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నా రని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనీల్‌ అంబానీ వ్యాపా రాన్ని కాపాడేందుకే రాఫెల్‌ ఒప్పందం కుదుర్చు కున్నారని అయాన అన్నారు. 'అంబానీ వ్యాపా రాన్ని కాపాడేందుకు మోడీ హిందూస్తాన్‌ ఏరో నాటిక్స్‌ లిమిటెడ్‌తో రాఫెల్‌ కాంట్రాక్టును రద్దు చేసి, 30వేల కోట్లు అంబానీ జేబులో పెట్టారు.'' అని రాహుల్‌ ఆరోపించారు. భారత్‌తో 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పం దాన్ని కుదుర్చుకోవాలంటే రిలయన్స్‌ గ్రూప్‌తో సంయుక్తంగా ప్రాజెక్టును చేపట్టడం తప్పనిసరి షరతు అని డసాల్ట్‌ ఏవియేషన్‌కి చెందిన ఉన్నతా ధికారి ఒకరు తన సిబ్బందికి తెలిపారని ఫ్రెంచ్‌ మీడియా కథనం పేర్కొంది. ఆ కథనాన్ని ప్రస్తా విస్తూ రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

రిల యన్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భారత ప్రధాని మోడీ చెప్పారని మాజీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు గతంలో వెల్లడించగా, ఇప్పుడు రాఫెల్‌ సీనియర్‌ అధికారి ఒకరు అదే విషయాన్ని పునరుద్ఘాటించారని రాహుల్‌ చెప్పారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుందనేది సుస్పష్టమైందన్నారు. 2017 మే 11వ తేదీన నాగ్‌పూర్‌లో డసాల్డ్‌ రిలయన్స్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (డిపిఆర్‌ఎల్‌) సంయుక్త రంగ ప్రాజెక్టు ప్రారంభ సందర్భంగా డసాల్ట్‌ ఉన్నతాధికారి చెప్పిన వివరాలకు సంబంధించిన అంతర్గత పత్రాన్ని ఫ్రెంచ్‌ న్యూస్‌ పోర్టల్‌ మీడియా సంపాదించింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫ్రాన్స్‌ పర్యటనను రాహుల్‌ ప్రశ్నించారు. రాఫెల్‌ కుంభకోణాన్ని మాఫీ చేసే ప్రయత్నంలో భాగమే ఇదన్నారు. రాఫెల్‌ కర్మాగారానికి ఆమె అంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ప్రశ్నించారు. బుధవారం రాత్రి మంత్రి మూడు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్ళారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించేందుకు గల అవకాశాలపై ఫ్రాన్స్‌ రక్షణ మంత్రితో, ఇతర అధికారులతో చర్చలు జరుపుతారు. దొడ్డిదారిన డబ్బులు చెల్లించకపోతే ఒప్పందం కుదిరే ప్రసక్తే లేదని ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారని దాసాల్ట్‌ సంస్థ అంతర్గత పత్రం పేర్కొంటోందని రాహుల్‌ చెప్పారు.