‘అమ్మాయిలు బీర్లు తాగేస్తున్నారు’

‘అమ్మాయిలు బీర్లు తాగేస్తున్నారు’

  పనాజీ : గోవాలో అమ్మాయిలు బీర్లు సేవించడం ఆందోళన కలిగిస్తుందని ఆ రాష్ట్ర సీఎం మనోహర్ పారికర్ అన్నారు. నిన్న గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్‌లో మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. అమ్మాయిలు బీర్లు సేవించడం.. నిజంగా తనకు భయమేస్తుందన్నారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉందని తెలిపారు. అమ్మాయిలందరూ బీర్లు సేవిస్తున్నారని తాను అనడం లేదు. ఇక్కడున్న వారిలో కొందరైనా బీర్లు తాగే వారు ఉండి ఉంటారని పారికర్ పేర్కొన్నారు. గత రెండేళ్లలో బీర్లు తాగే అమ్మాయిల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని గోవా సీఎం గుర్తు చేశారు. గతేడాది ఆగస్టు నుంచి డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. డ్రగ్స్ దందా చేస్తోన్న 170 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల కోసం యువత బారులు తీరడం చూస్తే గోవా యువత హార్డ్ వర్క్ చేయడం లేదని స్పష్టంగా తెలుస్తోందని మనోహర్ పారికర్ పేర్కొన్నారు.