అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల జీతాల పెంపు

అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల జీతాల పెంపు

 న్యూఢిల్లీ : వేతనాల పెంపు కోసం ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు సుదీర్ఘకాలంగా జరిపిన పోరాటంతో ఎట్టకేలకు కేంద్రం తలొగ్గింది. వారి వేతనాలను పెంచుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడి మంగళవారం ప్రకటించారు. వచ్చే నెల నుండి పెరిగిన వేతనాలను పొందుతారని తెలిపారు. ఇప్పటి వరకు నెలకు రూ.3000 వేతనం తీసుకుంటున్న అంగన్‌వాడీ కార్యకర్తలు ఇక మీదట రూ.4,500 పొందనున్నారు. అదేవిధంగా రూ.2,200 వేతనంగా అందుకుంటున్న కార్యకర్తలు రూ.3,500 అందుకుంటారు. అంగన్‌వాడి హెల్పర్లకు కూడా రూ.1500 నుండి రూ.2,250లకు వేతనం పెరిగింది. ఆయా కార్యకర్తల పనితీరుకు అనుగుణంగా రూ.250 నుండి రూ.500 వరకు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. అంగన్‌వాడీల పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వారికి స్వల్పంగా వేతనాలు పెంచిందని ఏపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి. బేబిరాణి, కె. సుబ్బరావమ్మ మంగళవారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.