ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి

ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి

  శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సుంజ్వాన్‌లోని ఆర్మీశిబిరంపై శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవానులు, ఓ జవాను కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. తీవ్రవాదులు ఆర్మీ క్యాంపు వెనక వైపు ఉన్న నాలా ద్వారా చొరబడ్డట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ముగ్గురు లేక నలుగురు తీవ్రదాదులు పాల్గొన్నట్టు సమాచారం.

ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ క్యాంపునకు 500 మీటర్ల వెలుపల ఉన్న అన్ని స్కూళ్లను మూసివేయాల్సిందిగా ఆధికారులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జైషే ఈ మొహ్మద్‌ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఉగ్రదాడితో కేంద్రహోం శాఖ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్‌ డీజీపీతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.