ఆర్టికల్‌ 35-ఎ రాజ్యాంగ విరుద్ధం

ఆర్టికల్‌ 35-ఎ రాజ్యాంగ విరుద్ధం

 న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌ నివాసులకు ప్రత్యేక అధికారాలను కల్పించే భారత రాజ్యాగంలోని ఆర్టికల్‌ 35-ఎను సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి సోమవారం ప్రకటించారు. ఈ ఆర్టికల్‌ రాజ్యాంగ విరద్ధమని పేర్కొంటూ, మహిళా హక్కులకు వ్యతిరేకంగా ఉందని ఆయన ఆరోపించారు. కాగా, 35-ఎ ఆర్టికల్‌కు బిజెపి మినహా కాశ్మీర్‌లోయలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ ఈ ఆర్టికల్‌తో తాము భయపడమని, ఆందోళన కారులు అన్నింటినీ ఉగ్రవాద అంశాల ప్రేరణతో చేస్తున్నట్లు స్పష్టమౌతోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాక ఈ ఆర్టికల్‌ రాజ్యాంగ విరద్ధంగా ఉందని, సుప్రీంకోర్టు కోట్టేయాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ రాజ్యాంగంలోని 370 వఅధికరణం జమ్మూ, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిందని, అయితే ఆర్టికల్‌ 35-ఎ ని అనుమతించమని అన్నారు.