బలిచ్చే సాంప్రదాయాన్ని నిషేధించనున్న శ్రీలంక

బలిచ్చే సాంప్రదాయాన్ని నిషేధించనున్న శ్రీలంక

   శ్రీలంక : మొక్కులుగా జంతువులు, కోళ్ళను బలిచ్చే సాంప్రదాయాన్ని శ్రీలంక ప్రభుత్వం నిషేధించనుంది. బౌద్ధులు అధికంగా ఉండే లంకలో హింసాత్మక చర్యలపై అనేక సంవత్సరాలుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం సాంప్రదాయ సమీక్షకు వెళ్లగా, హిందూ, ముస్లింలలోని ఈ బలి ఈ సాంప్రదాయం ఆపేస్తే ఇబ్బందేమీ లేదని చాలా ధార్మిక సంస్థలు ప్రభుత్వానికి తెలిపాయి. దీంతో హిందూ వ్యవహరాల మంత్రిత్వ శాఖ త్వరలోనే దీనిపై ప్రకటన చేయనుంది.