బ‌స్సు ప్ర‌మాదంలో 10 మంది మృతి

బ‌స్సు ప్ర‌మాదంలో 10 మంది మృతి

   సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో గురువారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో 30 మందికి గాయాలయ్యాయి. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పంజాబ్‌ నుంచి కాంగ్రా వెళ్తున్న ప్రయాణికుల బస్సు ధలియారా వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఇది గుర్తించిన సమీప ప్రాంతాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.