బెంగుళూరు డిప్యూటీ మేయర్‌ మృతి

బెంగుళూరు డిప్యూటీ మేయర్‌ మృతి

  బెంగళూరు : డిప్యూటీ మేయర్‌ ఆర్‌.రామిలా ఉమాశంకర్‌ (44) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందినట్లు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున రెండుగంటల సమయంలో అకస్మాత్తుగా గుండెనొప్పిరావడంతో ఆస్పత్రికి తరలించామని, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని వారు పేర్కొన్నారు. కాగా, గోవిందరాజ్‌ నియోజకవర్గంలో కావేరిపురా వార్డు కౌన్సిలర్‌ అయిన ఆమె జెడి(ఎస్‌) నుండి మొట్టమొదటి డిప్యూటి మేయర్‌గా సెప్టెంబర్‌ 28న ఎన్నికవడంతో అక్టోబర్‌ 3న భాద్యతలు స్వీకరించారు. అక్టోబర్‌ నాలుగున ఆమె ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వరతో కె.ఆర్‌ మార్కెట్‌ను తనిఖీ చేపట్టిన అనంతరం నమ్మా మెట్రోలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు పాల్గొన్నారు.