భారత నావికా దళంలో మహిళా పైలెట్స్

భారత నావికా దళంలో మహిళా పైలెట్స్

కేరళ: భారత నావికా దళంలో నలుగురు మహిళా పైలెట్ అధికారులను నావికాదళం ఎంపిక చేసింది. దీంతో భారత నావికా దళంలో మొట్టమొదటి సారిగా మహిళా పైలెట్స్ ఎంపికయ్యారు. కేరళలోని కన్నూర్‌ జిల్లాలో ఉన్న ఇండియన్‌ నావల్‌ ఎకాడెమీలో నావల్‌ ఓరియంటేషన్‌ పూర్తి చేసుకున్న ఈ నలుగురి మహిళలకు నావల్‌ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లన్బా పట్టాలు ప్రదానం చేశారు. తర్వాత విధులు చేపట్టబోయే ముందు ఈ నలుగురూ సంబంధిత విభాగాల్లో తర్ఫీదు పొందనున్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుభాంగి స్వరూప్‌, న్యూఢిల్లీకి చెందిన ఆస్తా సెహ్‌గల్‌, పుదుచ్చేరికి చెందిన రూప.ఎ, కేరళకు చెందిన ఎస్‌.శక్తిమాయ. నావికాదళంలోని నావల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టొరేట్‌ (NAI) విభాగంలో ఈ నలుగురు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఉమన్‌ పైలెట్‌గా సుభాంగి స్వరూప్‌ హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీలో శిక్షణ పొందుతారు.