భారత్‌, బల్గేరియా మధ్య నాలుగు ఒప్పందాలు

భారత్‌, బల్గేరియా మధ్య నాలుగు ఒప్పందాలు

  సోఫియా : భారత్‌, బల్గేరియాల మధ్య నాలుగు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, బల్గేరియా అధ్యక్షుడు రూమెన్‌ రాదెవ్‌ల మధ్య చర్చలు పూర్తయిన తర్వాత పెట్టుబడులు, పర్యాటకం, పౌర అణు సహకారం, సోఫియా యూనివర్శిటీలో హిందీ విభాగం ఏర్పాటుపై ఈ ఒప్పందాలు చేసుకున్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం కింద రక్షణ, ఐటి రంగాల్లో కీలక భాగస్వామి కావాల్సిందిగా బల్గేరియాను రాష్ట్రపతి కోరారు. శాస్త్రీయ సహకారం పెంపుపై కూడా మరో ఒప్పందం జరిగింది. సోఫియాలో మీడియాతో రాష్ట్రపతి కోవింద్‌ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలు వున్నాయని ఆ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు.