భారత్‌తో చర్చలకు పాక్ ఆర్మీ సిద్ధం !

భారత్‌తో చర్చలకు పాక్ ఆర్మీ సిద్ధం !

 న్యూఢిల్లీ: భారత్‌తో శాంతి చర్చలు నిర్వహించేందుకు పాకిస్థాన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాసియా జర్నలిస్టులతో ఈ విషయాన్ని ఓ పాక్ మిలిటరీ ప్రతినిధి వెల్లడించారు. దేశాధినేతలతో పాటు ఆర్మీ ప్రతినిధులు కూడా చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ ఖామర్ జావెద్ బజ్వా భారత్‌తో చర్చలకు ప్రయత్నిస్తున్నట్లు కొన్ని వర్గాలు వెల్లడించాయి.

పాక్ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నా.. ఆ దేశ ఆర్మీ మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న అభిప్రాయాలు చాన్నాళ్లుగా వ్యక్తం అవుతూనే ఉన్నాయి. 2016లో జరిగిన యూరి దాడి తర్వాత ఇస్లామాబాద్‌తో సంబంధాలను భారత్ అధికారికంగా తెంచుకున్నది. దీంతో ద్వైపాక్షిక చర్చలకు బ్రేక్ పడింది. ఎన్‌ఎస్‌ఏ చీఫ్ అజిత్ దోవల్, నాజిర్ జంజువాలు పలుమార్లు కలిసినా.. శాంతి ప్రక్రియకు మాత్రం చోటు దక్కడం లేదు. భారత్ పాల్గోనే సైనిక విన్యాసాల్లో తాము పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పాక్ జనరల్ గఫూర్ ఓ సందర్భంలో వెల్లడించారు. దీంతో భారత్‌తో శాంతి చర్చలకు పాక్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు అందాయి.