బీహార్‌, యుపి ఘటనలపై దద్దరిల్లిన పార్లమెంట్‌

బీహార్‌, యుపి ఘటనలపై దద్దరిల్లిన పార్లమెంట్‌

 న్యూఢిల్లీ-బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలపై పార్లమెంట్‌ దద్దరిలింది. మహిళలపై అత్యాచార ఘటనలపై పార్లమెంటరీ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాయి. మంగళవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయ సభల్లో ఇదే అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో రాజ్యసభ ప్రారంభం అయిన వెంటనే గంటపాటు వాయిదా పడింది. తొలుత లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. అనంతరం సమాజ్‌వాది పార్టీకి చెందిన ఎంపి దర్మేంద్ర యాదవ్‌ యుపిలోని ముజఫర్‌ పూర్‌లో జరిగిన అత్యాచార ఘటనను లేవనెత్తారు. బాలికలపై అత్యాచారాలకు పాల్పడ్డారని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు జరిగాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పార్లమెంట్‌ సభ్యులతో కమిటీ వేయాలని, ఆ కమిటీ యుపి, బీహార్‌తో పాటు అన్ని రాష్ట్రాల్లో పర్యటించి కేంద్రా నికి నివేదిక అందజేస్తోందని చెప్పా రు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్జేడీ పక్షనేత జయప్రకాశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ బీహార్‌, యుపిలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని అన్నారు. వాటిపై చర్యలు తీసుకోవడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని పేర్కొన్నారు.

హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ముజఫర్‌పూర్‌ ఘటన దిగ్భ్రాంతిక రమని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటన ఒక ఎన్జీఒ నిర్వహిస్తున్న వసతి గృహంలో చోటు చేసుకుందని, దాన్ని నిర్వహిస్తున్న భార్య భర్తలిద్దరిని అరెస్టు చేశామని, సంబంధిత అధికారిని సస్పెండ్‌ చేశామని తెలిపారు. హోం మంత్రి సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు సభను వాకౌట్‌ చేశా యి. రాజ్యసభలో ఇదే ఘటనపై ఎస్పీ, ఆమ్‌ఆద్మీ పార్టీలతో పాటు ప్రతిపక్షాలు ఆందోళన చేప ట్టాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను 12గం టలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ఆందోళన కొన సాగింది. అంతకు ముందు పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద ఎస్పీ, ఆర్జేడి, సిపిఐ, ఆర్‌ఎల్‌డి ఎంపిలు ఆందోళన చేపట్టారు.